Tuesday, November 26, 2024

AP Elections: ఈసీ మరో సంచలనం- అక్కడ రీపోలింగ్..!

ఏపీలో ఎన్నికల వేళ ఎలక్షన్ కమిషన్ (ఈసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఉద్యోగులకు నిర్వహిస్తున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌లో సమస్య ఎదురైంది. ఇక్కడ ఉద్యోగులకు ఇవ్వాల్సిన పోస్టల్ బ్యాలెట్ స్థానంలో ఈవీఎం బ్యాలెట్ పేపర్లను ఇచ్చారు. ఉద్యోగులు సైతం వాటిపైనే ఓట్లు వేశారు. చివర్లో విషయం తెలియడంలో విపక్షాలు ఈసీకి ఫిర్యాదు చేయడంతో రీపోలింగ్‌కు ఆదేశాలిచ్చింది. మరో రెండ్రోజుల్లో అక్కడ రీపోలింగ్ జరగనుంది.

చిలకలూరిపేట నియోజకవర్గంకు సంబంధించి పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగానికి గణపవరం జిల్లా పరిషత్‌ స్కూలులో ఫెసిలిటేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. పి.వోలు, ఎపివోలకు పోలింగ్ నిర్వహించారు. మొత్తం 1219 మంది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం పోలింగ్‌ పూర్తయిన తరువాత అధికారులు పొరపాటును గుర్తించారు. పోస్టల్‌ బ్యాలెట్‌లకు బదులు ఈవిఎంలలో పెట్టే బ్యాలెట్‌లను ఉద్యోగులకు అందచేశారు. ఉద్యోగులు ఈ బ్యాలెట్‌లపై ఓటు వేశారు. ఓటింగ్‌ పూర్తయిన తరువాత గుర్తించిన అధికారులు విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియ చేశారు. ఈవ్యవహారంపై ఉన్నతాధికారులు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌కుమార్‌ మీనాకు నివేదించారు. ఈ విష‌యంపై విప‌క్షాలు ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఈసీ రీపోలింగ్ కు ఆదేశాలిచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement