Tuesday, November 26, 2024

బద్వేల్ ఉప ఎన్నికః వాలంటీర్లపై సీఈఓ కీలక ఆదేశాలు

కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గ ఉప ఎన్నిక సందర్భంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిందన్నారు. ఎన్నికల ప్రక్రియలో గ్రామ, వార్డు సచివాలయాల వాలంటీర్లు పాల్గొనేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో ఇంటింటి ఎన్నికల ప్రచారానికి ఐదుగురికి మించి వెళ్లకూడదని సూచించారు. బద్వేల్ నియోజకవర్గంలో 80 ఏళ్లు దాటిన 3,837 మందికి, దివ్యాంగులకు కూడా పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యాన్ని కల్పించినట్లు వివరించారు. నియోజకవర్గ పరిధిలో 272 కేంద్రాల్లో 30 కేంద్రాలు సున్నితమైనవిగా గుర్తించినట్లు చెప్పారు. కొవిడ్‌ నిబంధనల అమల్లో భాగంగా ప్రచారంలో ద్విచక్ర వాహన, ఇతర ర్యాలీలు నిర్వహించకూడదని ఆదేశించారు. నామినేషన్‌ వేసే సమయంలో అభ్యర్థితోపాటు ఒక్కరే వెళ్లాలన్న ఎన్నికల అధికారి.. బహిరంగ ప్రదేశాల్లో జరిగే సమావేశాల్లో వెయ్యి మందికి మించి ఉండకూడదని చెప్పారు.

ఇది కూడా చదవండిః ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ

Advertisement

తాజా వార్తలు

Advertisement