Friday, November 22, 2024

AP: మార్చి 30న ఇచ్చిన ఆదేశాలు పాటించాల‌న్న ఎన్నిక‌ల సంఘం

గ‌త నెల పంపిణీపై ఫిర్యాదులందాయి..
మ‌రోసారి పున‌రావృతం కానివ్వ‌వ‌ద్దు
న‌గ‌దు బ‌దిలీ లేదా ఇంటింటికి పంపిణికి ప్రాధాన్యం ఇవ్వండి
ఏపీ ప్రభుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శికి ఈసీ లేఖ
అమరావతి: పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్‌ అమలు దృష్ట్యా లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరింది. పింఛన్‌ సహా నగదు బదిలీ పథకాలకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను మార్చి 30న జారీ చేసినట్లు వెల్లడించింది. ఆ మార్గదర్శకాలను వాస్తవిక దృష్టితో ఆలోచించి అమలు చేయాలని సీఎస్‌ జవహర్‌రెడ్డికి తేల్చిచెప్పింది. పంపిణీకి శాశ్వత ఉద్యోగులను వినియోగించుకోవాలని స్పష్టం చేసింది. పింఛన్ల ఇంటింటి పంపిణీకి వాలంటీర్లకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకోవాలని ఈసీ ఆదేశించింది.

పింఛన్ల అందజేతలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై చాలా ఫిర్యాదులు వచ్చాయని ఈసీ పేర్కొంది. లబ్ధిదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురైనట్లుగా తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. ఎలక్ట్రానిక్ విధానాల ద్వారా పంపిణీతో పాటు ఉద్యోగుల ద్వారా అందజేయవచ్చని గత మార్గదర్శకాల్లో చెప్పినట్లు వెల్లడించింది. లబ్ధిదారులకు అసౌకర్యం కలగకుండా, ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని సీఎస్ జవహర్‌రెడ్డికి సూచించింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement