Thursday, November 21, 2024

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల రద్దు.. సింగిల్ బెంచ్ ఆదేశాలపై ఎస్ఈసీ పిటిషన్

ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల రద్దును సవాలు చేస్తూ ఏపీ హైకోర్టులో ఎస్‌ఈసీ పిటిషన్ దాఖలు చేసింది. ఎన్నికలు రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ డివిజన్ బెంచ్‌లో ఎస్‌ఈసీ పిటిషన్ దాఖలు చేసింది. ఏపీ హైకోర్టులో గురువారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. 

కాగా, ఎన్నికలకు నాలుగు వారాల ముందు కోడ్ అమలు చేయాలన్న సుప్రీం కోర్టు తీర్పుకు విరుద్ధంగా ఎన్నికలు నిర్వహించారని, అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను ప్రభుత్వం పాటించలేదని గత నెలలో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికలు చెల్లవంటూ నోటిఫికేషన్ ను రద్దు చేసింది. ఎన్నికల కమిషనర్ తీరుపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ ఏడాదికిపైగా సుదీర్ఘంగా కొనసాగుతోంది. పరిషత్‌ ఎన్నికలకు మొదట 2020 మార్చి 7వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్‌ అప్పటి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్ జారీ చేశారు. నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ ప్రక్రియ కూడా ముగిసి తుది అభ్యర్ధుల జాబితాలు ఖరారైన తర్వాత కరోనా ఉద్ధృతితో ఎన్నికల ప్రక్రియను వాయిదా వేశారు. నిమ్మగడ్డ పదవి కాలం ముగియడంతో ఆయన స్థానంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని బాధ్యతలు చేపట్టిన అనంతరం ఈ ఏడాది ఏప్రిల్‌ 8వ తేదీన మధ్యలో ఆగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు పోలింగ్‌ ప్రక్రియను పూర్తి చేశారు. అయితే, టీడీపీ, జనసేన తదితర పార్టీలు పరిషత్‌ ఎన్నికలపై కోర్టును ఆశ్రయించడంతో మే 21న ఆగిపోయిన ఎన్నికల కొనసాగింపునకు ఏప్రిల్‌ 1న రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ తీర్పు హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ఆదేశాలు వెలువరించింది. కాగా, 2020 మార్చిలో పరిషత్‌ ఎన్నికల నామినేషన్ల సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 126 జడ్పీటీసీ, 2,371 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement