Tuesday, November 26, 2024

AP ఈసెట్ ఫలితాలు విడుద‌ల‌… బాలిక‌ల‌దే పై చేయి

    మొత్తం 36.369 మంది ప‌రీక్ష‌ల‌కు హాజ‌రు
    90.41 శాతం ఉత్తీర్ణత

    ఏపీ ఈసెట్‌ 2024 ఫలితాలు రిలీజ్ అయ్యాయి. అనంతపురం- జేఎన్‌టీయూలో ఈ సెట్‌ ఛైర్మన్‌ శ్రీనివాసరావు, కన్వీనర్‌ భానుమూర్తి, అధికారులు కలిసి ఈ ఫలితాలను విడుదల చేశారు. పాలిటెక్నిక్‌ పూర్తి చేసిన విద్యార్థులు బీటెక్‌ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశానికి మే 8వ తేదీన నిర్వహించిన ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 36, 369 మంది విద్యార్థులు హాజరయ్యారు. అయితే, ఫలితాల్లో 90.41శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో బాలురు 89.35 శాతం కాగా, బాలికలు 93.34 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు.

    కాగా, అభ్యర్థులు cets.apsche.ap.gov.inలో మీ రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేసి ఏపీ ఈసెట్ ఫలితాలను చూసుకోవచ్చు. ఇక, అభ్యర్థులు ఈసెట్ ఫలితాన్ని ర్యాంక్ కార్డ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంది. అర్హత పొందిన అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ ఈసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొన్నాల్సి ఉంది. ఏపీ ఈసెట్ ఫలితాలను అధికారులు ఉదయం 11 గంటల తర్వాత విడుదల చేశారు.

    - Advertisement -

    Advertisement

    తాజా వార్తలు

    Advertisement