Friday, November 22, 2024

ఏపీ ఎంసెట్​ పేపర్​ అనాలిసిస్​, డిఫికల్టీ లెవల్స్​ని ఇట్లా చెక్​ చేసుకోవచ్చు!

అనంతపురంలోని జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్, అగ్రికల్చరల్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP EAMCET 2022)ని నిర్వహిస్తోంది. AP EAMCET లేదా EAPCET రెండు షిఫ్ట్ లలో జరుగుతోంది. ఈ పరీక్ష వ్యవధి 3 గంటలు ఉంటుంది.  AP EAMCET 2022 ప్రశ్న పత్రాన్ని అధికారులు cets.apsche.ap.gov.inలో అధికారిక పోర్టల్‌లో త్వరలో విడుదల చేయనున్నారు. AP EAMCET జవాబు కీ 2022 కూడా అధికారిక వెబ్‌సైట్‌లో ప్రశ్న పత్రాలతో పాటు విడుదల చేయనున్నారు. కాగా, AP EAMCET ఫలితాలను ఆగస్టు 15న వెలువరించనున్నట్టు తెలుస్తోంది.

AP EAMCET 2022 పేపర్ విశ్లేషణ, విశ్వవిద్యాలయం షిఫ్ట్ 1 కోసం AP EAMCET 2022 పరీక్షను జూలై 4న నిర్వహించింది. ఈరోజు AP EAMCET 2022 ప్రశ్నపత్రం మితమైన స్వభావం కలిగి ఉంది. అయితే, అభ్యర్థులు ఫిజిక్స్, కెమిస్ట్రీతో కంపేర్​ చేస్తే గణిత విభాగం కాస్త లెంగ్తీగా ఉన్నట్లు గుర్తించారు. సబ్జెక్ట్ వారీగా AP EAMCET 2022 పేపర్ విశ్లేషణ ఈ క్రింద ఇస్తున్నాం పరిశీలించవచ్చు. రెండో షిఫ్ట్​కి సంబంధించిన విశ్లేషణ త్వరలోనే రిలీజ్​ చేయనున్నట్టు సమాచారం.

AP EAMCET ప్రశ్నాపత్రం 2022ని డౌన్‌లోడ్ చేయడం ఎలా?

AP EAMCET అధికారిక వెబ్‌సైట్ -sche.ap.gov.in/EAPCETని ఓపెన్​ చేయాలి. హోమ్‌పేజీలో అందుబాటులో ఉన్న AP EAMCET ప్రశ్నాపత్రం లింక్‌పై క్లిక్ చేయాలి. ఇక్కడి నుంచి AP EAMCET ప్రశ్నాపత్రాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తదుపరి సూచనల కోసం ఆ ప్రింట్‌అవుట్‌ని దాచుకోవచ్చు.

AP EAMCET 2022 జవాబు కీ:

- Advertisement -

జవాబు కీ షీట్​ని డౌన్​ లోడ్​ చేసుకోవడానికి AP EAMCET అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్​ చేయాల్సి ఉంటుంది.- sche.ap.gov.in/ EAPCET. “పరీక్ష పేపర్లు మరియు ప్రిలిమినరీ కీలు” లింక్‌పై క్లిక్ చేయాలి. షిఫ్ట్ ల వారీగా AP EAMCET 2022 జవాబు కీ స్క్రీన్‌పై అందుబాటులో ఉంటుంది. AP EAMCET జవాబు కీని PDF ఫైల్‌లుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement