ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా జమ్మలమడుగు డీఎస్పీ యశ్వంత్ నియమితులయ్యారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు జమ్మలమడుగు డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన యశ్వంత్.. ఎన్నికలను నిజాయితీగా నిర్వహించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన సమర్ధవంతంగా విధులు నిర్వర్తించినందుకు గానూ, ఆయనను ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
యశ్వంత్ గతంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా పుత్తూరు, ఉమ్మడి అనంతపురం జిల్లా పుట్టపర్తి, తిరుపతి వెస్ట్, జమ్మలమడుగు సబ్ డివిజన్లకు డీఎస్పీగా పని చేశారు.