Tuesday, July 2, 2024

AP | సమ్మె విరమించిన‌ ద్రావిడ తాత్కాలిక ఉద్యోగులు

కుప్పం, (ప్రభ న్యూస్) : ద్రావిడ విశ్వావిద్యాలయ తాత్కాలిక ఉద్యోగులకు గత 11 నెలలుగా జీతాలు లేకపోవడంతో రెండు నెలలుగా వర్సిటీ పరిపాలన భవనం ముందుకు బైటాయించి నిరసన చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా బహిరంగ సభలో ద్రావిడ తాత్కాలిక ఉద్యోగులకు 6 నెలల జీతాలు ప్రస్తుతం అందిస్తున్నామని అందుకు సంబంధించి అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

దీంతో వర్సిటీ తాత్కాలిక ఉద్యోగులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. గురువారం తూర్పు రాయలసీమ పట్టభధ్రుల ఎం ఎల్ సి కంచెర్ల శ్రీకాంత్ వర్సిటీ తాత్కాలిక ఉద్యోగులతో చర్చించారు. ముఖ్యమంత్రి వర్సిటీ తాత్కాలిక ఉద్యోగుల సమస్యలను పరిష్కారం చేస్తారని వర్సిటీని ప్రక్షాళన చేసి వర్సిటీ అభివృద్ధి చేస్తారని తెలిపారు. వర్సిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ఒక కమిటీ ని సైతం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగులు వెంటనే తమ విధుల్లోకి చేరాలని ఆదేశించారు.

థాంక్యూ సీఎం సార్…

ద్రావిడ తాత్కాలిక ఉద్యోగుల సమస్యల పట్ల స్వయానా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బహిరంగ సభలో ప్రస్థావినిసదం పట్ల తాత్కాలిక ఉద్యోగులు ” థాంక్యూ సి ఎం సార్ ” అంటూ నినాదాలు చేశారు. అదేవిధంగా తమ సమస్యల పట్ల పరిష్కారానికి నిత్యం కృషి చేసిన ఎం ఎల్ సి కంచెర్ల శ్రీకాంత్, తెలుగు దేశం పార్టీ నాయకులకు ధన్యవాదములు తెలిపారు. ఇకనైనా వర్సిటీలో తమ సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కారం అవుతుందని ఆశభావం వ్యక్తం చేస్తూ.. శుక్రవారం నుండి యాదవిధిగా తమ విధులకు హాజరువుతున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement