అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న అన్నక్యాంటీ-న్లకు శ్రీలక్ష్మీ వెంకటేశ్వర డెవలపర్స్ సంస్థ రూ.1 కోటి విరాళం అందించింది. విజయవాడకు చెందిన ఎస్.ఎల్.వీ డెవలపర్స్ అధినేత పెనుమత్స శ్రీనివాసరాజు మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి రూ.1 కోటి చెక్కును అందించారు. రాబోయే ఐదేళ్ల పాటు ప్రతి ఏడాది అన్నక్యాంటీన్లకు కోటి రూపాయల చొప్పున విరాళం అందిస్తానని శ్రీనివాసరాజు తెలిపారు. భారీ విరాళం ఇచ్చిన శ్రీనివాసరాజును సీఎం చంద్రబాబు అభినందించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement