Monday, November 25, 2024

AP | ఒక్కరోజేలోనే 94 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి..

ఏపీలో కొత్తగా కొలువు దీరిన టీడీపీ కూటమి ప్రభుత్వం పాలనలో మార్పులు తీసుకువస్తుంది. గతంలో వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ పింఛన్ పంపిణీ చేయగా.. ఈసారి సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికీ వెళ్లి జులై పింఛన్లు పంపిణీ చేశారు. రాష్ట్రంలో ఇవాళ ఒక్కరోజులోనే 94 శాతం మందికి పెన్షన్ల పంపిణీ పూర్తయింది. ఏపీలో మొత్తం 65,18,496 మంది పింఛనుదారులు ఉండగా, వారిలో 61 లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.

- Advertisement -

విజయనగరం, కడప, శ్రీకాకుళం జిల్లాల్లో అత్యధికంగా 97 శాతం మందికి పెన్షన్ల పంపిణీ పూర్తి చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యల్పంగా 91 శాతం మందికి పెన్షన్లు ఇచ్చారు. నేటి ఉదయం 6 గంటలకే లబ్ధిదారుల ఇళ్ల వద్ద పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలందరూ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement