ఆంధ్రప్రదేశ్‌లో సలహాదారులందరినీ ప్రభుత్వం తొలగించింది. మొత్తం 40 మంది సలహాదారులను తొలగిస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 4వ తేదీ (ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి) నుంచి ఈ తొలగింపు అమల్లోకి వచ్చినట్టు ఉత్తర్వుల్లో జీఏడీ వెల్లడించింది.
ఇదిలా ఉండగా.. బుధవారం సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు 20 మంది సలహాదారులు తమ పదవులకు రాజీనామా చేశారు. సంగతి తెలిసిందే. చేయని వారిని తాజాగా ప్రభుత్వం తొలగించింది. మరోవైపు మంత్రుల పేషీల్లోని సిబ్బందిని జీఏడీ మాతృ శాఖలకు పంపింది. ఆయా మంత్రుల పీఏ, పీఎస్, ఏపీఎస్‌లు ఈ నెల 11వ తేదీలోగా మాతృ శాఖల్లో రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు జీఏడీ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
మంత్రుల పేషీల్లోని ఫైళ్లు, రికార్డులను, డాక్యుమెంట్లను సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు అందచేయాలని ఆదేశించారు. ఫర్నిచర్, కంప్యూటర్, స్టేషనరీల జాబితాను అక్నాలెడ్జ్ చేసి ఇవ్వాలని.. నో డ్యూస్ సర్టిఫికెట్లు తీసుకోవాలని.. మంత్రుల నివాసాల్లో ఉన్న ఫర్నిచర్‌ను కూడా అక్నాలెడ్జ్ చేసివ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రుల నివాసాల్లో ఉన్న ఫైళ్లను కూడా సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు అందచేయాలని ఆదేశించింది.