Tuesday, November 19, 2024

AP – కాకినాడ‌లో జిల్లాలో డ‌యేరియా…ఒక‌రి మృతి… 50 మందికి అస్వ‌స్థ‌త‌

కాకినాడ జిల్లాలో డయేరియా పంజా విసురుతుంది. తొండంగి మండలం కొమ్మనాపల్లిలోని గ్రామస్తులు డయేరియా బారిన పడుతున్నారు. సుమారు 50 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో గ్రామస్తులు ఆసుపత్రిలో చేరుతున్నారు. ఇక, చికిత్స పొందుతూ ఓ మహిళ మృతి చెందింది. గ్రామ సచివాలయంలో పలువురికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలో పరిస్థితులను డీఎంహెచ్ఓ పరీశీలించారు. వాటర్ ట్యాంక్ లో నీటిని టెస్టింగ్ కోసం పంపించారు. అలాగే, నిల్వ ఉన్న రొయ్యల కూర, మామిడి తాండ్ర తినడం వలన కొందరు అస్వస్థతకు గురయ్యారని గ్రామస్థులు చెప్తున్నారు. కాగా, దీనిపై స్పందించిన ప్ర‌భుత్వం ఆ గ్రామంలో ప్ర‌త్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసింది.. అక్క‌డే అంద‌రికి చికిత్స్ అందిస్తున్నారు..

ఈ ఘటనపై తుని ఎమ్మెల్యే యనమల దివ్య స్పందించారు. కొమ్మనాపల్లి గ్రామంలో 34 మంది అస్వస్థతకు గురయ్యారు అని తెలిపింది. అందులో పది మంది కోలుకున్నారు.. ఫుట్ పాయిజన్, వాటర్ పొల్యూషన్ అస్వస్థతకి కారణమ‌ని వెల్ల‌డించారు.. అవ‌స‌ర‌మైతే మెరుగైన చికిత్స కోసం కాకినాడ జీజీహెచ్ కి తరలించే ఏర్పాటు చేస్తున్నామ‌ని చెప్పారు..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement