ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతిపై రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఈరోజు తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ కేసుపై డీజీపీ స్పందించారు. శుక్రవారం జరిగిన ఈ ఘటనపై ఇప్పటికే కేసు నమోదు చేశామని చెప్పిన డీజీపీ.. వైద్య నివేదికలు అందాక పూర్తి స్థాయి దర్యాప్తును మొదలుపెడతామని చెప్పారు. కేసు దర్యాప్తును వీలైనంత త్వరగా ముగిస్తామని ఆయన వెల్లడించారు. విజయవాడ అత్యాచారం కేసులో పోలీసులు సరిగా స్పందించలేదని తేల్చేసిన రాజేంద్రనాథ్ రెడ్డి.. బాధ్యులపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. ఇక మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ వ్యవహారంలో సహకరించని కారణంగానే ఏపీపీ సుజాతపై సస్పెన్షన్ వేటు పడిందని ఆయన తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement