Tuesday, October 1, 2024

AP | తిరుమలకు చేరుకున్న డిప్యూటీ సీఎం..

తిరుమల, ప్రభన్యూస్‌ ప్రతినిధి : తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనార్ధం డిప్యూటి సీఎం పవన్‌కళ్యాణ్‌ మంగళవారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రం చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన రోడ్డు మార్గాన అలిపిరికి చేరుకున్నారు. అక్కడ వందలాదిగా గుమికూడిన అభిమాలను చూసి కొంతసేపు ఆలోచించి యాత్రికుల ఇబ్బందుల గురించి అధికారులతో చర్చించారు.

అనంతరం మొక్కు తీర్చుకోవాలనే ఉద్దేశ్యంతో అలిపిరి మెట్లమార్గాన తిరుమలకు బయలుదేరి రాత్రికి తురుమలకు చేరుకున్నారు. కాగా అక్కడక్కడా నడకదారిలో అలిసిసొలసిపోయారు. గాలిగోపురం వద్ద నడవడానికి కొంతమేర ఇబ్బందులు పడ్డారు. కొంతమంది భక్తబృందం ఆంజనేయస్వామి జెండాను గాలిగోపురం వద్ద డిప్యూటి సీఎంకు అందించారు.

అలిపిరి నడకమార్గంలో డిప్యూటి సీఎం జై శ్రీరామ్‌, గోవింద గోవింద అంటూ నామస్మరణ చేసుకుంటూ రాత్రి 9.30 గంటలకు వచ్చారు. పద్మావతి అతిథిగృహాలలోని గాయిత్రి అతిథిగృహం వద్ద డిప్యూటి సీఎంకు రిసెప్షన్‌ అధికారులు పుష్పగుచ్చం అందచేసి ఘనంగా స్వాగతం పలికారు.

రాత్రి ఆయన తిరుమలలోనే బసచేసి బుధవారం ఉదయం శ్రీవారిని దర్శించుకుని ప్రాయశ్చిత్త దీక్ష విరమణ చేస్తారు. అనంతరం వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఆహారం తీసుకుని, లడ్డూలకు అవసమైన ముడిసరుకులు నిల్వవుంచే గోదామును పరిశీలించనున్నారు. కాగా పవన్‌కళ్యాణ్‌ను చూసేందుకు భారీసంఖ్యలో అభిమానులు గుమికూడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement