కాకినాడ – ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం , జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రెండో రోజు మంగళవారం కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఉదయం కలెక్టరేట్‌లో పంచాయతీరాజ్, అటవీశాఖ, కాలుష్య నియంత్రణ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలోని ప్రధాన సమస్యలపై చర్చించారు. పంచాయతీరాజ్, గ్రామీణ నీటిపారుదలశాఖల పరిధిలోని పలు సమస్యలను పవన్ అడిగి తెలుసుకున్నారు.
ఈ సమావేశంలో ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, జిల్లా పరిషత్ ఛైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, వనమాడి కొండబాబు, పంతం నానాజీ, వరుపుల సత్యప్రభ తదితరులు పాల్గొన్నారు
కాగా, అనంతరం సాయంత్రం గొల్లప్రోలులో నివాసానికి బయలుదేరి వెళతారు. పవన్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత వరుస సమీక్షలు నిర్వహిస్తూ ఆయా శాఖల తాజా పరిస్థితిని అధ్యాయనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ కూడా పీఆర్, అటవీ, కాలుష్య నియంత్రణ శాఖల ఉన్నతాధికారులతో పలు అంశాలపై పవన్ చర్చించనున్నారు.