Wednesday, September 18, 2024

AP | డిప్యూటీ సీఎం పవన్‌ను కలిసిన రష్యా ఆస్ట్ర‌నాట్..

ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను రష్యాకు చెందిన వ్యోమగామి సెర్గ్ కోర్సకోవ్ కలిశారు. హైదరాబాదులోని పవన్ కల్యాణ్ నివాసానికి వచ్చిన కోర్సకోవ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సెర్గ్ కోర్సకోవ్ కు పుష్పగుచ్ఛం అందించిన పవన్ కల్యాణ్, శాలువా కప్పి సత్కరించారు.

ఈ సమావేశంలో సెర్గ్ కోర్సకోవ్ తో పాటు స్పేస్ కిడ్జ్ ఇండియా వ్యవస్థాపకురాలు, సీఈవో డాక్టర్ కేషన్, సీఓఓ యజ్ఞసాయి, సంస్ధ ప్రతినిధులు ఎస్.బి.అర్జునర్, సాయి తన్య పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement