ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన ప్రకటన చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ ఒంటరిగా నిలబడి ఒక్క స్థానం గెలిస్తే.. చంద్రబాబు ఇంట్లో తాను పాచి పని చేసేందుకు సిద్ధమని తెలిపారు. చంద్రబాబునాయుడు ఉన్నవాళ్ల కోసం తపన పడతారని.. అదే సీఎం జగన్ లేని వాళ్ల కోసం తపిస్తారని చెప్పారు. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను అడ్డగోలుగా కొనుగోలు చేసి రెడ్లకు మంత్రి పదవులు ఇచ్చారని విమర్శించారు. ఒక్క ఎస్సీకి అవకాశం కల్పించారా? అని ప్రశ్నించారు. ఎస్సీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. గతంలో తనను కూడా టీడీపీలోకి లాక్కునేందుకు.. ఎంతో మందితో చంద్రబాబు బేరాలు ఆడించారని ఆరోపించారు. తాను డబ్బులకు, పదవులకు లొంగే వ్యక్తిని కాదనే విషయాన్ని అప్పట్లోనే నిరూపించానని గుర్తు చేశారు. తాను అవినీతి పరుడని నిరూపిస్తే.. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకొంటానని నారాయణ స్వామి స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: ఏపీలో వైసీపీబన్లు.. తాలిబన్లని మించిపోయారు