Friday, November 22, 2024

AP | వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎం : జగన్

ఎన్నికల ప్రచారానికి ఈ రోజే చివరి తేదీ కావడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో భాగంగా పిఠాపురంలో చివరి ప్రచార సభలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ… వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎంని చేస్తానని సీఎం జగన్ పిఠాపురం ప్రజలకు హామీ ఇచ్చారు.

పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిస్తే పిఠాపురంలో ఉండరని, హైదరాబాద్ వెళ్ళిపోతారని విమర్శించారు. గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం అన్నాడు, ఇప్పుడు పిఠాపురం అంటున్నాడు, ఎన్నికలయ్యాక హైదరాబాద్ పారిపోతాడని అన్నారు ముఖ్యమంత్రి జగన్. మొదటి నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టిన జగన్, చివరి ప్రచార సభను కూడా అక్కడే నిర్వహించారు.

ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించి 99 శాతం హామీలు అమలు చేశామని జగన్ తెలిపారు. 2 లక్షల 31 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. అక్కాచెల్లెమ్మల పేరుపై 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చామన్నారు. రైతులకు పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నాం. విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతన్నకు తోడుగా ఉన్నాం. డ్రైవర్‌ అన్నదమ్ములకు వాహనమిత్ర, నేతన్నలకు నేతన్న నేస్తం.

జగనన్న తోడు, చేదోడుతో చిరు వ్యాపారులకు తోడుగా నిలిచామని గుర్తు చేశారు. 2 లక్షల 70 వేల కోట్ల రూపాయలు నేరుగా ప్రజల ఖాతాల్లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం జమ చేసింది. రాబోయే ఐదేళ్ల ఇంటింటి అభివృద్ది, పథకాల కొనసాగింపును నిర్ణయించే ఎన్నికలు. ఐదేళ్లు లంచాలు, వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు అందించాం. ఇంటి వద్దకే పెన్షన్‌, పౌరసేవలు, పథకాలు ఇస్తున్నామన్నారు.

చంద్రబాబును నమ్మడం అంటే కొండ చిలువ నోట్లో తలపెట్టడమేనన్నారు. కూటమికి ఓటేస్తే పథకాలన్నిటింకీ ముగింపే. సాధ్యంకాని హామీలతో చంద్రబాబు మేనిఫెస్టో ఇచ్చారని.. పొరపాటున బాబుకు ఓటు వేస్తే ప్రజలు మోసపోయినట్టేనని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement