Sunday, July 7, 2024

AP | సూర్యారాధన ఆచరించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమాజ శ్రేయస్సు, దేశం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ సూర్యారాధన చేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వారాహి ఏకాదశ దిన దీక్షలో ఉన్నారు. ఇందులో భాగంగా సూర్యారాధన నిర్వహించారు. వారాహి ఏకాదశ దిన దీక్షలో భాగంగా నిర్వహించిన సూర్యారాధనలో వేదపండితులు బ్రహ్మశ్రీ కోసిగంటి సుధీర్ శర్మ, హరనాథశర్మ, వేణుగోపాలశర్మ ఈ పూజ విశిష్టతను పవన్ కళ్యాణ్ కు వివరించారు.

ప్రజల జీవన విధానంలో సూర్య నమస్కారాలు ఒక భాగమని వివరించారు. వనవాసంలో ధర్మరాజు ప్రత్యక్ష భగవానుడిని ప్రార్థించి అక్షయ పాత్ర పొందారని మహా భారతం చెబుతోందన్నారు. శ్రీ మహావిష్ణువు సూర్యభగవానుడి నుంచి చక్రాయుధాన్ని పొందారని వివరించారు. బ్రిటిష్ పాలకుల ప్రభావంతో ఆదివారం అంటే సెలవు దినంగా మారిపోయిందని, నిజానికి మన దేశ సంస్కృతిలో ఆదివారానికి విశిష్టత ఉందన్నారు. రవివారం అని పిలిచే ఆ రోజు సూర్యుడిని ఆరాధించి పనులకు శ్రీకారం చుట్టేవారని గుర్తు చేశారు. అందుకే ఆదివారాన్ని కృషివారం అని కూడా అంటారని వేద పండితులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement