Monday, July 1, 2024

Janasenani: కొండ‌గ‌ట్టుకు ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్

ఏపీ ఉప ముఖ్య‌మంత్రి పవన్ కల్యాణ్ శనివారం కొండగట్టు అంజన్నను దర్శించుకోనున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని మాదాపూర్ నివాసం నుంచి ఉదయం 7 గంటలకు ఆయన రోడ్డు మార్గాన బయలుదేరారు. మెగా ఇంటి ఇలవేల్పు అయిన ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోనున్నారు. ఉదయం 11 గంటలకు జగిత్యాల జిల్లాలో ఉన్న కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి రానున్నారు.

అక్క‌డ అంజ‌నేయ స్వామిని ద‌ర్శించుకుని ప్ర‌త్యేక పూజ‌లు చేయిస్తారు ప‌వ‌న్ క‌ల్యాణ్.. అనంత‌రం మ‌ధ్యాహ్నం 12.30కి అక్క‌డ నుంచి రోడ్డు మార్గంలో హైద‌రాబాద్ కు బ‌య‌లు దేరుతారు.. ఈ ప‌ర్య‌ట‌న సంద‌ర్బంగా కొండ‌గ‌ట్టు వ‌ద్ద ఎపి పోలీసులు తెలంగాణ పోలీసుల స‌హ‌కారంతో భారీ భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ ‘వారాహి’ అమ్మవారి దీక్షలో ఉన్నారు. 11 రోజుల పాటు దీక్ష కొనసాగనుంది. ఈ దీక్షలో భాగంగా కొండగట్టు అంజన్నను దర్శించుకోనున్నారు.

- Advertisement -

పవన్ కళ్యాణ్‌కు గజ మాలతో స్వాగతం..

సిద్దిపేట జిల్లా ములుగు మండలం వంటిమామిడి వద్ద జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఘనంగా గజమాలతో ఆయన అభిమానులు స్వాగతం పలికారు.. అనంతరం అభిమానులకు అభివాదం చేసుకుంటూ కొండగట్టుకు బయలుదేరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement