అమరావతి, ఆంధ్రప్రభ: సాగునీటి ప్రాజెక్టుల మౌలిక సూత్రాలకూ, నిబంధనలకు విరుద్ధంగా తుంగభద్రపై కర్ణాటక ప్రభుత్వం నిర్మిస్తున్న అప్పర్ భద్ర ప్రాజెక్టును అడ్డుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. ఈ మేరకు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలుకు రంగం సిద్దమైంది. అప్పర్ భద్ర నిర్మాణాన్ని నిలుపుదల చేయటంతో పాటు- కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ హోదా, జారీ చేసిన సాంకేతిక అనుమతులన్నిటినీ రద్దు చేయాలని ఏపీ డిమాండ్ చేస్తోంది. అప్పర్ భద్ర కోసం బచావత్ -టైబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–1) ఒక్క చుక్క నీటిని కూడా కేటాయించలేదు. బచావత్ తరువాత వచ్చిన బ్రిజేష్ కుమార్ -టైబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–2) కృష్ణాలో 65 శాతం నీటి లభ్యత ఆధారంగా కేటాయించిన 10 టీ-ఎంసీలు కూడా సుప్రీంకోర్టు ఆదేశాలతో నోటిఫై కాలేదు. కర్ణాటక మాత్రం బ్రిజేష్ కుమార్ -టైబ్యునల్ కేలాయించిన 10 టీ-ఎంసీలకు తోడు కే-8, కే-9 బేసిన్ లో మిగిలిన 6 టీ-ఎంసీలు, పోలవరం నుంచి కృష్ణా డెల్టాకు మళ్ళించే 21 టీ-ఎంసీల్లో 2.4 టీ-ఎంసీలు..ఇలా అన్నిటినీ కలుపుకుని 29.9 టీ-ఎంసీలతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపొందించి కేంద్రం నుంచి అన్ని అనుమతులు తీసుకు రాగలిగింది.
అడిగిందే తడవుగా కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతులు ఇవ్వటమ కాకుండా కర్ణాటక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జాతీయ హోదాతో పాటు- బడ్జెట్ లో రూ 5300 కోట్లను కూడా కేటాయించింది. అప్పర్ భద్ర ప్రాజెక్టు పూర్తయితే కర్ణాటకలోని చిక్ మంగళూరు, చిత్రదుర్గ, తుమకూరు, దావణగెరె జిల్లాల్లోని 2,25,515 హెక్టార్లకు సాగునీరందించే వెసులుబాటు- కలుగుతుంది. దీని వల్ల రాయలసీమతో పాటు- ప్రకాశం జిల్లాకు సాగునీటి కష్టాలు మరింత పెరిగే అవకాశం ఉంది. అప్పర్ భద్ర పూర్తయితే నిర్ణీత సమయంలో శ్రీశైలంకు వరద వచ్చే అవకాశం లేకుండా పోతుంది. శ్రీశైలం, సాగర్‌పై ఆధారపడ్డ కృష్ణా డెల్టాతో పాటు- తుంగభద్ర పరిధిలోని రాయలసీమ ప్రాంతం ఎడారిగా మారిపోయే ప్రమాదం పొంచి ఉంది. దిగువ రాష్ట్రమైన ఏపీ సాగునీటి హక్కులు హరించేలా కృష్ణాలో కేటాయింపులు లేని ప్రాజెక్టుకు అనుమతులివ్వటంపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అన్ని విషయాలు వివరించేందుకు సిద్దపడుతోంది. మరో వైపు రాయలసీమ జిల్లాల్లోనూ అప్పర్ భద్రపై నిరసనలు మిన్నంటు-తున్నాయి. రాయలసీమ సాగునీటి సాధన సమితి, రాయలసీమ మేధావుల పోరం, ఏపీ అభివృద్ధి వికేంద్రీకరణ సాధన సమితి తదితర సంస్థలు, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు అప్పర్ భద్ర ప్రమాదాన్ని వివరిస్తూ అన్ని ప్రాంతాల్లో సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అప్పర్ భద్ర అత్యంత వివాదాస్పద ప్రాజెక్టుగానూ, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు అంతకుమించి వివాదాస్పదంగానూ మారనున్నాయి.
అప్పర్ భద్రను ఆపాల్సిందే..
Advertisement
తాజా వార్తలు
Advertisement