అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీ కోర్సులు ప్రారంభంకానున్నాయి. ప్రస్తుతం సంప్రదాయ మూడేళ్ల డిగ్రీ కోర్సులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మూడేళ్ల డిగ్రీలను కొనసాగించడంతోపాటు నాలుగేళ్ల డిగ్రీ కోర్సులను కూడా ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం, ఉన్నత విద్యాశాఖ నిర్ణయం తీసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ విద్యావిధానం- 2020లో భాగంగా పలు సంస్కరణలు ప్రతిపాదిం చింది. అందులో భాగంగా అన్ని రాష్ట్రాల్లోని సెంట్రల్ యూనివర్సిటీలు, అన్ని విశ్వవిద్యాల యాలు, వాటి పరిధిలోని కళాశాలల్లో నాలుగేళ్ల కాల వ్యవధితో ఉండే డిగ్రీ కోర్సులు అందు బాటులోకి రాను న్నాయి.
ఇదిలా ఉంటే రాష్ట్రంలో నాలుగేళ్ల డిగ్రీ కోర్సులపై నూతన జాతీయ విద్యావి ధానం రాకముందే ఉన్నత విద్యామం డలి ప్రభుత్వానికి ప్రతిపాదించింది. మూడేళ్ల డిగ్రీ కోర్సు కు అదనంగా నాలుగో ఏడాది చదివిన కోర్సు కు సంబం ధించి ఇంటర్న్‌షిప్ విద్యార్థులతో పూర్తి చేయించాలని సూచిం చింది. తద్వారా డిగ్రీ పూర్తయిన విద్యార్థి మరే ఇతర ప్రైవేట్ కోచింగ్ సెంటర్‌లో అదనంగా కోర్సులు లేదా ఏవైనా సంస్థల్లో అప్రెంటీస్ షిప్ చేయాల్సిన అవసరం లేకుండా నేరుగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందే అవకాశం కలుగుతుందని తెలిపింది.
2013లోనే ప్రారంభించినా..
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) నాలుగేళ్ల ఆనర్స్‌డిగ్రీ కోర్సులకు 2013లోనే అనుమతిం చింది. అయితే అప్పుడు ప్రవేశపెట్టిన కోర్సులపై విద్యా ర్థులు పెద్దగా ఆసక్తి చూపించలేదు. దీంతో నూతన విద్యా విధానంలో భాగంగా మార్పులతో నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీలను ప్రవేశపెట్టింది. ఇప్పటికే ఈ అంశంపై భారీగా కసరత్తు జరపడంతోపాటు, యూజీసీతోను, యూనివర్సి టీ-లతోను కేంద్ర విద్యాశాఖ చర్చించింది. ఈ నేపథ్యంలో రా బోయే విద్యాసంవత్సరం నుంచి సెంట్రల్ యూని వర్సిటీ-లతోపాటు, అన్ని కళాశాలల్లో నాలుగేళ్ల డిగ్రీలు అందుబాటు లోకి రానున్నా యి. సంప్రదాయ మూడేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సులతో పాటు కొత్త కోర్సు లు కూడా అమల్లోకి వస్తాయి. ఇదిలా ఉంటే ఈ కోర్సుల్లో చేరిన తర్వాత మూడేళ్లకు కోర్సు పూర్తి చేయాలా, లేక నాలుగేళ్లు కొన సాగాలా అనే అంశంపై విద్యార్థి స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చు.
ఇంటర్న్ షిప్‌ను చేయడ మనేది పూర్తి ఐచ్ఛికమని ఉన్నత విద్యా మండలి స్పష్టం చేస్తోం ది. మరోవైపు పోస్ట్ గ్రాడ్యు యట్ కోర్సులు రెండేళ్లు ఉండగా.. నాలుగేళ్ల డిగ్రీకి మరో ఏడాది కలిపి పీజీ కోర్సులను అందుబాటు లోకి తేవాలని నిర్ణయించింది. విద్యార్థులు, సమాజంలో ఉన్న డిమాం డ్‌ను బట్టి కోర్సుల నిర్వహణ, ప్రారంభం అనేది విశ్వవి ద్యాల యాలు సొం తంగా నిర్ణయించుకునే వెసులుబాటు ఉంది.