Saturday, November 23, 2024

ఏపీలో గత రెండు నెలల్లో 1.60 లక్షల మరణాలు కారణమేంటీ..?

ఏపీలో మరణాలు భారీగా సంభవిస్తున్నాయి. గత రెండు నెలల్లో ఏకంగా 1.60 లక్షల మంది మరణించారు. మే నెలలో 85,978 మరణాలు నమోదు కాగా, జూన్‌లో 82,205 మరణాలు సంభవించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. సాధారణంగా అయితే నెలకు 30 నుంచి 35 వేల మరణాలు నమోదవుతాయి. గత రెండు నెలల్లో మరణాల సంఖ్య విపరీతంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. వైద్య ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం.. ఏప్రిల్‌లో 776, మేలో 2938, జూన్‌లో 1776 కొవిడ్ మరణాలు సంభవించాయి. ఇతర కారణాలతో ఏప్రిల్ నుంచి జూన్ వరకు 2,05,518 మంది మరణించినట్టు జనన, మరణ ధ్రువీకరణ పోర్టల్ గణాంకాలు చెబుతున్నాయి. దీనిని బట్టి ఏప్రిల్‌లో 37,335, మే, జూన్ నెలల్లో కలిపి 1,68,183 మరణాలు నమోదయ్యాయి. మూడు నెలల్లో మొత్తంగా 2.05 లక్షల మంది మరణించగా, వీరిలో 82 వేల మంది మహిళలు ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో మేలో అత్యధికంగా 3 వేల మంది మహిళలు మరణించారు. గత మూడు నెలల్లో 1.29 లక్షల మంది ఇంటి వద్ద, ఆసుపత్రులకు వెళ్లే సమయంలో మరణించారు.

ఇది కూడా చదవండి: వైఎస్‌ వారసులకి తెలంగాణలో స్థానంలేదు: షర్మిలకు హరీష్‌ రావు కౌంటర్

Advertisement

తాజా వార్తలు

Advertisement