Tuesday, November 26, 2024

ఏపీలోని 8 జిల్లాల్లో కరోనా ఆంక్షల సడలింపు

ఏపీలో కరోనా తగ్గుముఖం పడుతోంది దీంతో ఆంక్షల సడలింపు లకు రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. కేసులు తక్కువగా నమోదవుతున్న 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలింపులు ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కోవిడ్‌ పాజిటివిటీ రేటు 5శాతం కన్నా తక్కువ ఉన్న జిల్లాల్లో సడలింపులను అమలు చేయనుంది. 8 జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటలవరకూ కర్ఫ్యూ సడలింపు ఇస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇక క రాత్రి 9 నుంచి 10 గంటల మధ్య దుకాణాలు, రెస్టారెంట్లు ఇతరత్రా మూసివేయనున్నారు. ఇక ఉభయదావరి, కృష్ణా, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5శాతం కన్నా ఎక్కువగా ఉన్నందున ఈ జిల్లాల్లో సాయంత్రం 6 నుంచి ఉదయం 6వరకూ కర్ఫ్యూ విధిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. జులై 1 నుంచి జులై 7 వరకూ తాజా నిర్ణయాలు వర్తించనున్నాయి. పాజిటివిటీ రేటు పరిశీలించాక ఈజిల్లాల్లో సడలింపుపై మళ్లీ నిర్ణయం తిసుకోనుంది ప్రభుత్వం.

Advertisement

తాజా వార్తలు

Advertisement