Saturday, November 23, 2024

కరోనా రికవరీ రేటులో ఏపీ టాప్..

కరోనా రికవరీ రేటులో ఏపీ టాప్ లో నిలిచింది. దేశంలో జూలై 1 నాటికి 96.95 శాతంగా ఉన్న రికవరీ రేటు ఇప్పుడు 97.31 శాతంగా నమోదైంది. ఒక దశలో రాష్ట్రంలో రోజుకు 24 వేల కరోనా కేసులు నమోదవ్వగా.. ఇప్పుడు 3 వేల కేసులే వస్తున్నాయి. అలాగే రికవరీ రేటు కూడా 84 శాతానికి పడిపోయిన పరిస్థితి నుంచి.. ఇప్పుడు 97.31 శాతానికి చేరింది. దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువ రికవరీ రేటు నమోదు కావడం గమనార్హం.

పాజిటివ్‌ వచ్చిన వాళ్లు కూడా ఆస్పత్రులకు వచ్చి చికిత్స పొందాల్సిన అవసరం రాకుండానే కోలుకుంటున్నారు. ఇంట్లో చికిత్స పొందుతున్న వారికి ప్రభుత్వమే హోం ఐసొలేషన్‌ కిట్‌లు అందిస్తోంది. 104 కాల్‌ సెంటర్‌లో పేర్లు నమోదు చేసుకున్న డాక్టర్లు.. ఇంట్లో చికిత్స పొందుతున్న బాధితులకు ఫోన్‌ చేసి సలహాలు, సచనలు ఇస్తున్నారు. ఆస్పత్రుల్లో బెడ్స్‌ కోసం 104కు కాల్‌ చేసే వారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. ఐసీయూ, ఆక్సిజన్, సాధారణ బెడ్స్‌ ప్రతి జిల్లాలోన పెద్ద సంఖ్యలో అందుబాటులో ఉన్నాయి.

ఇది కూడా చదవండి: రెండేళ్లలో 300 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నా చలనం లేదు: నారా లోకేష్

Advertisement

తాజా వార్తలు

Advertisement