Wednesday, November 20, 2024

ఏపీలో కరోనా కేసులు ఎన్నంటే..?

ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. తాజాగా ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 42,679 శాంపిల్స్‌ పరీక్షించగా.. 839 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తాజా టెస్ట్‌లతో కలుపుకుని.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నిర్వహించిన టెస్ట్‌ల సంఖ్య 2,77,63,761కు చేరింది. ఇక, మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,39,529కి పెరగగా.. ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 20,11,063కు చేరుకుంది.. మరోవైపు.. ఇప్పటి వరకు 14,078 మంది కోవిడ్‌ బాధితులు రాష్ట్రంలో మృతిచెందగా.. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 14,388గా ఉన్నాయని పేర్కొంది ఏపీ ప్రభుత్వం. ఇక, గుంటూరు, కృష్ణా జిల్లాలో ఇద్దరు చొప్పున, చిత్తూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున.. మొత్తం 8 మంది కోవిడ్‌ బాధితులు కన్నుమూశారు. ఇదే సమయంలో 1,142 మంది పూర్థిస్థాయిలో కోలుకున్నారని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.

ఇది కూడా చదవండి: కోహ్లీ అలా చేయకుండా ఉండాల్సింది: గంభీర్..

Advertisement

తాజా వార్తలు

Advertisement