Saturday, November 23, 2024

ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు

ఏపీలో కొత్తగా 3,620 కేసులు రిపోర్ట్ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 18,85,716 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల 41 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 12,671కి చేరింది. 24 గంటల వ్యవధిలో 5,757 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 18,32,971కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో40,074 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,18,95,922 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. అత్యధికంగా చిత్తూరులో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.

ఇది కూడా చదవండి: హైదరాబాద్ లో విరబూసిన బ్రహ్మకమలాలు..

Advertisement

తాజా వార్తలు

Advertisement