ఏపీలో కరోనా మహమ్మారి ఎక్కడా తగ్గడం లేదు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 52,319 శాంపిల్స్‌ను టెస్ట్ చేయగా 1115 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 20,14,116కి చేరింది. ఇందులో 19,85,566 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ కాగా, 14,693 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 19 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో 13,857 మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా నుంచి 1265 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. చిత్తూరులో 210, గుంటూరులో 121, కృష్ణాలో 165, నెల్లూరులో 120, ప్రకాశంలో 121, పశ్చిమ గోదావరి జిల్లాలో 125 కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి నుంచి బయటపడాలి అంటే వ్యాక్సిన్ తీసుకోవడం ఒక్కటే మార్గం కావడంతో వేగంగా వ్యాక్సిన్‌ను అమలు చేస్తున్నారు. వ్యాక్సినేషన్ అమలు చేస్తున్నా కేసులు పెరుగుతుండడంతో తప్పని సరిగా నిబంధనలు పాటించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నది.
ఇది కూడా చదవండి: కరోనా పై యుద్ధం..మహారాష్ట్రలో 144 సెక్షన్