Tuesday, November 26, 2024

ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు… కొత్తగా ఎన్నంటే.!

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. దాదాపు రెండు నెలల తర్వాత ఏపీలో రోజువారీ కేసులు పది వేల లోపుకు దిగొచ్చాయి. అయితే, మరణాలు ఉద్ధృతి మాత్రం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 84,461 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 7,943 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా మహమ్మారికి 98 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 19,845 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని ఆరోగ్యవంతులు అయ్యారు. ఇప్పటి వరకు మొత్తం 16,93,085 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం 1,53,795 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు మొత్తం 10,930 మంది మరణించారు.

గడిచిన 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో 15, పశ్చిమగోదావరిలో 12, ప్రకాశంలో 10, అనంతపురం 9, తూర్పుగోదావరి 8, శ్రీకాకుళం 7, కృష్ణా, కర్నూల్, విజయనగరం జిల్లాల్లో ఆరుగురు, గుంటూరు, నెల్లూరు జిల్లాలో నలుగురు కడపలో ముగ్గురు చొప్పున మరణించారు.

ఇక, గడిచిన 24 గంటల్లో తూర్పు గోదావరి, చిత్తూరు జిల్లాలను మినహాయిస్తే, మిగతా అన్ని జిల్లాల్లో వెయ్యికి లోపే కొత్త కేసులు వచ్చాయి. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1877 కేసులు నమోదు అయ్యాయి. అనంతపురం 544, చిత్తూరు 12831, గుంటూరు 765, విశాఖపట్నం 551, పశ్చిమగోదావరి జిల్లా 968, శ్రీకాకుళం 623, నెల్లూరు 378, కర్నూల్ 499, ప్రకాశం 345, విజయనగరం 551, కడప 447, కృష్ణలో 291 కరోనా పాటిజివ్ కేసులు నమోదు అయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement