Wednesday, November 20, 2024

AP | సీబీఐకి జనరల్ కన్సెంట్ కొనసాగింపు…

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీబీఐకి మరోసారి జనరల్ కన్సెంట్ జారీ చేసింది. సీబీఐ విచారణ పరిధిని కొనసాగించేందుకు, పెంచేందుకు ఈ గెజిట్ వీలు కల్పిస్తుంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం… రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై విచారణకు సీబీఐ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం ప్రకారం సీబీఐ ఏర్పడింది. ఈ కారణంగా అన్ని రాష్ట్రాలు సీబీఐ విచారణకు జనరల్ కన్సెంట్ జారీ చేయాల్సి ఉంటుంది.

బీజేపీ వ్యతిరేక పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సీబీఐ కు జనరల్ కన్సెంట్ ఉపసంహరించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్నప్పుడు 2018లో సీబీఐకి జనరల్ కన్సెంట్ ఉపసంహరించారు. అయితే జగన్ గెలిచిన తర్వాత మళ్లీ పునరుద్ధరించారు. ఇప్పుడు చంద్రబాబుకు సీబీఐతో ఎలాంటి సమస్యలు లేవు.. ఎన్డీఏలో భాగంగా ఉన్నందున ఏపీ ప్రభుత్వం సీబీఐకి అనుమతిని కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement