Tuesday, November 26, 2024

AP | కలుషిత ఆహారం… 50 మంది విద్యార్థినులకు అస్వస్థత

అల్లూరి జిల్లా అరకులోయ నియోజకవర్గం దంబ్రిగూడ మండలం బొందుగూడ బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కారణంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కలుషిత ఆహారం తిని దాదాపు 50 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను హుటా హుటిన అరకులోయ ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాలికలు ప్రస్తుతం అరకులోయ ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కొంతమంది విద్యార్థినులకు హాస్టల్లోనే వైద్య సేవలు అందిస్తున్నారు.

కాగా, ఫుడ్‌ పాయిజన్‌తో అస్వస్థతకు గురైన విద్యార్థినుల పరిస్థితి నిలకడగా ఉందని పాడేరు డీఎం అండ్‌ హెచ్‌ఓ భాషా తెలిపారు. వీరిలో ముగ్గురికి డీహైడ్రేషన్ ఎక్కువగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో వారిని పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. హాస్టల్ లో & అరకు ఏరియా ఆసుపత్రిలో విద్యార్థుల పరిస్థితి బాగానే ఉందని, ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు.జాంగుడ హాస్టల్లో వైద్య సిబ్బందితో విద్యార్థినులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తూ వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచమన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement