Saturday, January 4, 2025

AP – కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ లో అప‌శృతి … అభ్య‌ర్ధి మృతి

మ‌చిలీప‌ట్నం – కృష్ణాజిల్లాలో నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాల దేహ దారుఢ్య పరీక్షలో అపశృతి చోటుచేసుకుంది. 1600 మీటర్ల పరుగు పందెంలో పడిపోయిన యువకుడు చికిత్స అందిస్తుండగా మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిలో మృతిచెందాడు.. మృతి చెందిన అభ్యర్థి కృష్ణాజిల్లా ఏ కొండూరు గ్రామానికి చెందిన ఎన్ చంద్రశేఖర్ (25)గా గుర్తించారు..

కాగా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డ్ గత కొన్ని రోజులుగా ఉద్యోగ నియమగా ప్రక్రియలో ప్రిలిమినరీ పరీక్ష ఉత్తీర్ణత పొందిన వారికి శరీర దారుఢ్య పరీక్షలు నిర్వహిస్తోంది.. ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన అభ్యర్థులకు లక్ష్మీ టాకీస్ సెంటర్‌లోని పోలీస్ కార్యాలయాన్ని పోలీస్ పెరల్స్ గ్రౌండ్స్ నందు ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు.. ఓ అభ్యర్థి ఈ ఈవెంట్స్ చేస్తూ ఉండగా పడిపోయాడు.. వెంటనే అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు. ఉద్యోగం సాధించి కుటుంబ సభ్యులను పోషిస్తాడని ఆశతో ఎదురుచూసిన తల్లిదండ్రులు ఈ చేదు వార్త కన్నీటిని మిగిల్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement