Saturday, November 23, 2024

AP – రోడ్ల మరమ్మతులపై దృష్టి పెట్టండి.. అధికారుల‌కు చంద్ర‌బాబు ఆదేశం ..

అమ‌రావ‌తి – వర్షాలు.. వరదలతో ధ్వంసమైన రోడ్ల మరమ్మతులపై దృష్టి సారాలించాలని ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు . అమ‌రావ‌తి స‌చివాల‌యంలో నేడు ఆయ‌న జు ఆర్‌ అండ్‌ బీ శాఖ అధికారుల‌తో సమీక్ష నిర్వహించారు.. ఈ సంద‌ర్బంగా ఆయ‌న అధికారుల‌తో మాట్లాడుతూ, వరదలకు ధ్వంసమైన రోడ్ల మరమ్మత్తులపై దృష్టి సారించాలన్నారు.. మొత్తం ఎన్ని కిలో మీటర్ల మేర రోడ్లు దెబ్బ తిన్నాయనే విషయంపై ఆరా తీశారు.. దీనికి రాష్ట్రవ్యాప్తంగా 4 వేల కిలో మీటర్లకు పైగా రోడ్లు దెబ్బ తిన్నాయన్న సీఎం దృష్టికి తీసుకెళ్లారు అధికారులు.. దీంతో ప్రాధాన్యాతల వారీగా దెబ్బతిన్న రోడ్లకు రిపేర్లు చేయాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు..

వాహ‌న క్లైమ్ లు త్వ‌రగా సెటిల్ చేయండి..

అనంతరం వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టం అంచనా కార్యక్రమంపై రివ్యూ నిర్వహించారు సీఎం. అది ముగిసిన వెంట‌నే విజయవాడ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు.. . వరద బాధితుల సాయంలో భాగంగా బ్యాంకర్లు, ఇన్ స్యూరెన్స్ ఏజెన్సీల ప్రతినిధులతో మాట్లాడారు.. వేలాది వాహనాలు దెబ్బతిన్న నేపథ్యంలో బీమా ఏజెన్సీలు త్వ‌ర‌త‌గ‌తిన బీమా క్లైమ్ లు సెటిల్ చేయాల‌ని కోరారు..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement