Saturday, November 23, 2024

AP: సీఎం జ‌గ‌న్ తో ముగిసిన మంత్రుల క‌మిటీ భేటీ

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డితో మంత్రుల క‌మిటీ భేటీ ముగిసింది. క్యాంపు కార్యాలయంలో నిర్వ‌హించిన ఈ స‌మావేశంలో మంత్రులు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, బుగ్గన రాజేంద్ర‌నాథ్ రెడ్డి, పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామ‌కృష్ణారెడ్డి, సీఎస్ సమీర్ శర్మలు పాల్గొన్నారు. ఈస‌మావేశంలో ఏడువేల 500 కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు ఆర్ధిక శాఖ అధికారులు.

స్టీరింగ్ కమిటీ సభ్యులు కమిటీ ముందు పెట్టిన ఇతర అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళారు మంత్రుల కమిటీ. నిన్న రాత్రి వరకు ఉద్యోగులతో చర్చించాం. ఉద్యోగుల్లో ఉన్న అసంతృప్తి, ఆవేదనకు పరిష్కారం చూపామ‌న్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఇప్పుడు మళ్లీ సమావేశమవుతున్నాం. అన్ని అంశాలు సీఎంకి వివరిస్తామ‌న్నారు. మధ్యాహ్నం మళ్లీ ఉద్యోగులతో చర్చిస్తామ‌ని, హెచ్ ఆర్ ఏ గురించి ఈ రోజు చర్చిస్తామ‌న్నారు. రికవరీ విషయంలో క్లారిటీ ఇచ్చామ‌ని, దీనివల్ల 6 వేల కోట్లు భారం ఉండొచ్చు అనుకుంటున్నామన్నారు. అలాగే హెచ్ఆర్ఏ, పెన్షన్ శ్లాబుల్లో మార్పులు, రికవరీ మినహాయింపుతో పడే ఆర్ధికభారంపై చర్చించిన‌ట్లు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement