Tuesday, November 26, 2024

వాణిజ్య ఉత్సవం.. ఒక అభివృద్ధి ఉత్సవం: సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పారిశ్రామికంగా గణనీయ వృద్ధి సాధించిందని సీఎం వైఎస్ జగన్ అన్నారు.  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వాణిజ్య ఎగుమతులను రెట్టింపు చేయడమే లక్ష్యంగా మంగళవారం ఏర్పాటు చేసిన ‘వాణిజ్య ఉత్సవం-2021’ కార్యక్రమాన్ని సీఎం జగన్‌ ప్రారంభించారు. అనంతరం వాణిజ్య ఉత్సవ్‌లో ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం జగన్‌ సందర్శించారు. స్టాల్స్‌ను పరిశీలించిన సీఎం జగన్‌ ఉత్పత్తులకు సంబంధించి పలు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎగుమతులకు సంబధించి ప్రత్యేకంగా ఈ- పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 2021లో ఎగుమతుల్లో 19.4 శాతం మేర వృద్ధి నమోదయిందని అన్నారు. 2020-2021లో ఎగుమతుల్లో ఏపీ నాలుగో స్థానంలో ఉందన్న సీఎం…రెండేళ్లలో​ రూ.20, 390 కోట్లతో 10 మెగా ప్రాజెక్టులు ఏర్పాటు చేశామని తెలిపారు. దీని ద్వారా  55 వేల మందికి ఉపాధి కల్పించినట్లు పేర్కొన్నారు. 68 మెగా పరిశ్రమలతో రూ.30,175 కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. మరో 62 మెగా ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయని చెప్పారు. ఏపీకి పరిశ్రమ వర్గాలు సహకరించాలని సీఎం జగన్‌ కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement