ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మంగళవారం రాత్రి ఫ్రాన్స్ రాజధాని పారిస్ పక్యటనకు బయలుదేరి వెళ్లారు. విజయవాడ సమీపంలోని గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఆయన ప్రత్యేక విమానంలో పారిస్ వెళ్లారు. ఈ సందర్భంగా జగన్‌కు ఆయన కేబినెట్‌లోని పలువురు మంత్రులు వీడ్కోలు పలికారు. పారిస్‌లో చదువుతున్న తన కూతురు కళాశాల స్నాతకోత్సవానికి జగన్ హాజరుకానున్నారు.
ఆదాయానికి మించి ఆస్తులున్న కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్… తన పారిస్ టూర్‌కు అనుమతించాలని పిటిషన్ దాఖలు చేసి నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు నుంచి అనుమతి తీసుకున్నారు. పారిస్‌లో పర్యటించేందుకు జగన్‌కు 10రోజుల పాటు కోర్టు అనుమతించింది. ఈ పర్యటన ముగించుకుని జగన్ జులై 3న తిరిగి రానున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.