ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇవ్వాల (సోమవారం) ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. గణపవరంలో జరిగే రైతు భరోసా కార్యక్రమంలో జగన్ పాల్గొంటారు. సోమవారం ఉదయం తాడేపల్లి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా బయలుదేరి ఉదయం 10. 10 గంటలకు గణపవరం హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ఉదయం 10.25 గంటలకు పిప్పర రోడ్డులోని చింతపాటి మూర్తి రాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని సభా ప్రాంగణానికి సీఎం చేరుకుంటారు.
ఆ తర్వాత ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొని రైతుల అకౌంట్లలో నేరుగా నిధులు విడుదల చేయనున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 12.05 గంటలకు హెలికాప్టర్ ద్వారా తిరిగి తాడేపల్లికి చేరుకోనున్నారు. ఈనెల 17న సీఎం జగన్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఓర్వకల్లు మండలం గుమ్మిటం తండా సమీపంలో 15వేల కోట్ల రూపాయల పెట్టుబడితో 5,410 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదనే లక్ష్యంగా గ్రీన్‌కో ఎనర్జీస్ లిమిటెడ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.