146 కొత్త 108 అంబులెన్స్‌లను ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం వద్ద జెండా ఊపి ప్రారంభించారు. 146 నూతన అంబులెన్స్‌లకు గానూ రాష్ట్ర ప్రభుత్వం రూ.34.79 కోట్లను ఖర్చు చేసింది. నూతన అంబులెన్స్‌ల ప్రారంభోత్సవంలో భాగంగా మొదట ఆరోగ్యశ్రీ సృష్టికర్త, దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి వైయస్ జగన్ నివాళులర్పించారు.
అనంతరం నూతన అంబులెన్స్‌లను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కొత్త అంబులెన్స్‌ల కోసం రూ.34.79 కోట్లు ఖర్చు చేసింది ఏపీ ప్రభుత్వం. 108 సేవల కోసం ఏటా ప్రభుత్వం రూ.188.56 కోట్లు…వెచ్చిస్తోంది.అంతకుముందు నూతన అంబులెన్స్‌లను పరిశీలించి వాటిలో కల్పించిన అత్యాధునిక వైద్య సదుపాయాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. నూతన 108 అంబులెన్స్‌ల ప్రారంభోత్సవంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు.