అక్రమాస్తుల వ్యవహరంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏసీ సీఎం జగన్ పై ఈడీ నమోదు చేసిన కేసులో విచారణ ఆగస్టు 6వ తేదీకి వాయిదా పడింది. సీబీఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ కేసులపై విచారణ చేపట్టొచ్చంటూ సీబీఐ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టును ఆశ్రయించగా.. విచారణ అనంతరం తీర్పు వాయిదా పడింది. ఈ క్రమంలో హైకోర్టు తీర్పు వచ్చే వరకు విచారణను నిలిపివేయాలన్న జగతి పబ్లికేషన్స్ దాఖలు చేసిన మెమోను పరిశీలించిన సీబీఐ కోర్టు విచారణను వాయిదా వేసింది. ఇక ఇండియా సిమెంట్స్ కేసులో అభియోగాల నమోదుపై వాదనలు వినిపించేందుకు సిద్ధం కావాలని జగన్, విజయసాయిరెడ్డిని కోర్టు ఆదేశించింది. ఎమ్మార్ అక్రమాలపై సీబీఐ, ఈడీ కేసులపై విచారణను ఆగస్టు 4కి వాయిదా వేసింది.
ఇది కూడా చదవండి: కోమటిరెడ్డి వెంకటరెడ్డి సర్వే: ఈటల గెలుపు ఖాయమట..