ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో చంద్రబాబు పోలవరం పర్యటన ఖరారైంది. సోమవారం (జూన్ 17) పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు సందర్శించి పోలవరం కార్యక్రమానికి శ్రీకారంచుట్టారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన తొలి క్షేత్ర పర్యటనను పోలవరం నుంచి ప్రారంభించనున్నారు.
చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పరిస్థితిని పరిశీలించి ప్రాజెక్టు పనులపై అధికారులతో సమీక్షలు నిర్వహించనున్నారు. పోలవరంతోపాటు మిగిలిన జలవనరుల ప్రాజెక్టులు పూర్తి చేయడానికి కార్యాచరణ సిద్ధం చేయనున్నారు. కేంద్రం నుంచి పోలవరంకు రావాల్సిన నిధులపై ప్రత్యేక దృష్టిపెట్టిన సీఎం.. నిర్దేశిత సమయంలోగా పోలవరంతోపాటు మిగిలిన ప్రాజెక్టులను పూర్తిచేయడానికి కసరత్తు చేస్తున్నారు.