- 18వ తేదిన కడప జిల్లాలో టూర్
- అదే రోజు ఉదయం గుంటూరు పర్యటన
- ఇక ఆ రోజు అమరావతికి రానున్న అమిత్ షా
- 18న రాత్రి కేంద్ర హోంమంత్రికి చంద్రబాబు డిన్నర్ మీట్
- పర్యటన షెడ్యూల్ విడుదల చేసిన ప్రభుత్వం
వెలగపూడి – ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సొంత జిల్లా పర్యటనకు సిద్ధమయ్యారు.. ఎల్లుండి గుంటూరుతో పాటు కడప జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగనుంది.. శనివారం రోజు సీఎం చంద్రబాబు గుంటూరు, కడప జిల్లాల పర్యటన ఖరారైంది.
ఉదయం గుంటూరు జిల్లా పర్యటనలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు.. అనంతరం వేస్టు టూ ఎనర్జీ ప్లాంటును ప్రారంభిస్తారు.. ఆ తర్వాత కడప జిల్లాలో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు ఏపీ ముఖ్యమంత్రి.. మధ్యాహ్నం నుంచి కడప జిల్లాలో పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు. ఇక అదేరోజు సాయంత్రం ఉండవల్లిలోని తన నివాసంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు మర్యాదపూర్వకంగా డిన్నర్ ఇవ్వబోతున్నారు.. మరోవైపు ఈనెల 19వ తేదీన దావోస్ పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు.