Monday, November 25, 2024

AP | ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ పోస్టర్ ఆవిష్కరించిన ఏపీ సీఎం చంద్రబాబు

రాఘవి మీడియా సంస్థ కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్ పేరిట కొన్నాళ్లుగా సినీ పరిశ్రమలోని పలు ప్రతిభావంతులకు అవార్డులను అందజేస్తోంది. కాగా, ఈసారి జూన్ 29న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్‌లో ఈ అవార్డులను అందజేయనున్నారు.

ఈ సందర్భంగా కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ పోస్టర్‌ను నేడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. అమరావతిలో సీఎం చంద్రబాబును రాఘవి మీడియా ప్రతినిధులు కలిశారు. ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డుల గురించి కళావేదిక ఆయనకు వివరించింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు వారికి అభినందనలు తెలుపుతూ పోస్టర్‌ను విడుదల చేసి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement