Wednesday, September 18, 2024

AP CM ఒక్క ఫోన్ కాల్ తో కేంద్రం నుంచి రానున్న 6 ఎన్డీఆర్ఎఫ్ టీమ్ లు, 40 పవర్ బోట్లు

అమరావతి – ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద పరిస్థితులను కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తెలియజేశారు. అమిత్ షాతో ఫోన్ లో మాట్లాడిన చంద్రబాబు వరద సహాయ చర్యలను వివరించారు. వరద ముంపు ప్రాంతాల్లో సహాయ చర్యల కోసం… ఎన్డీఆర్ఎఫ్ బృందాల ద్వారా పవర్ బోట్లు పంపాలని అమిత్ షాను కోరారు.

ఈ సందర్భంగా అమిత్ షా సానుకూలంగా స్పందించారు. కేంద్రం నుంచి అవసరమైన అన్ని రకాల సాయం చేస్తామని చంద్రబాబుకు హామీ ఇచ్చారు. హోంశాఖ కార్యదర్శి ద్వారా తక్షణ సాయం అందేలా చూస్తామని అమిత్ షా స్పష్టం చేశారు.

6 ఎన్డీఆర్ఎఫ్ టీమ్ లు, 40 పవర్ బోట్లు

కాగా 6 ఎన్డీఆర్ఎఫ్ టీమ్ లు ఇతర రాష్ట్రాల నుండి తక్షణమే ఏపీకి పంపుతున్నట్లు తెలిపిన హోం సెక్రటరీ తెలిపారు.

ఒక్కో ఎన్డీఆర్ఎఫ్ టీమ్ లో 25 మంది సిబ్బంది. ఒక్కో టీమ్ కు నాలుగు పవర్ బోట్లు..ఇవన్నీ రేపు ఉదయంలోపు విజయవాడకు చేరుకుంటాయని చెప్పారు.. మొత్తం 40 పవర్ బోట్లు రాష్ట్రానికి పంపుతున్నట్లు అయన చంద్ర బాబుకు తెలిపారు .వాయు మార్గంలో మరో నాలుగు ఎన్డీఆర్ఎఫ్ టీమ్ లను రేపు రాష్ట్రానికి పంపుతున్నట్లు వివరించారు.. సహాయక చర్యలకు 6 హెలికాఫ్టర్లు పంపుతున్నట్లు కూడా చెప్పారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement