Friday, November 29, 2024

AP – ఎమ్మిగనూరు కౌన్సిల్ సమావేశం రసాభాస…

-ఇరు పక్షాల కౌన్సిల్ సభ్యుల మధ్య రగడ
-క్షమాపణల కొరకు ఒకరిపై ఒకరు ఆరోపణలు
-పోడియం ముందు బైఠాయింపు
-గందరగోళం లోనే ముగిసిన సమావేశం

ఎమ్మిగనూరు టౌన్ (కర్నూలు జిల్లా) – ఎమ్మిగనూరు పురపాలక సంఘం లో శుక్రవారం జరిగిన కౌన్సిల్ సమావేశం లో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య రగడ రాజేసుకుంది. మున్సిపల్ ఛైర్మన్ డాక్టర్ కెయస్ రఘు అధ్యక్షత జరిగిన సమావేశంలో ముందుగా అజెండా అంశాలు ఆమోదిస్తున్నట్లు వైస్ చైర్మన్ నజీర్ ఆహ్మద్ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశామని, అందుకు పూర్తి సహకారం అందించిన ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి కి కృతజ్ఞతగా ఓం శాంతి సర్కిల్ కు ఆయన పేరు పెట్టాలనీ,అలాగే గోనెగండ్ల బైపాస్ కు అనేక కార్యాలయాల స్థల దాత హసన్ బేగ్ పేరు పెట్టాలని సూచించారు.

అనంతరం కౌన్సిలర్ నాగేషప్ప మాట్లాడుతూ గత సమావేశంలో నాల్గవ వార్డు కౌన్సిలర్ రామదాస్ గౌడు ఛైర్మన్ ను అసభ్య పదజాలం తో సంభోదించారని అందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అందుకు అధికార పార్టీ కౌన్సిలర్లు గత సమావేశంలో మహిళలు ఉన్నారని చూడ కుండా పార్టీ ఫిరాయించిన కౌన్సిలర్లు కు సిగ్గు లేదా అని కౌన్సిలర్ శివ ప్రసాద్ మాట్లాడం సమంజసం కాదని, ఆసమయంలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరామన్నారు. అయినా ఛైర్మన్ సమావేశం ముగించి నట్లు బెల్ మోగించి వెళ్లారని అన్నానని రామదాస్ గౌడు తెలిపారు.

- Advertisement -

అసభ్యంగా మాట్లాడటం నిజమేనని క్షమాపణలు చెప్పాలని వైస్ చైర్మన్ కలుగ జేసుకుని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పేంత వరకు సమావేశం జరుగనీయమని భీష్మించుక కూర్చున్నారు. అందుకు టిడిపి కౌన్సిలర్లు నిజానికి మీరే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇరువురు క్షమాపణల పేరుతో పోడియం ముందు బైఠాయించారు.ఇరువురు సంయమనం పాటించాలని ఛైర్మన్ పదే పదే చెప్పినా ఇరు పక్షాలు వినక పోవడంతో సమావేశం ముగించారు.

అంతకు ముందు కౌన్సిలర్ దయాసాగర్ మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అనతి కాలంలోనే ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి సహకారం తో శాశ్వత తాగునీటి పథకం, టెక్స్టైల్ పార్కు, సాగునీరు, పట్టణ సుందరీకరణ వంటి అంశాలపై శాసన సభలో మాట్లాడడం హర్ష నీయమన్నారు. ఈ సమావేశంలో కమీషనర్ గంగిరెడ్డి, మేనేజరు వరప్రసాద్, డిఈఈ నీరజ, విక్టర్ పాల్, రాజు నాయక్, ఏ ఈలు మదన్, శరత్ చంద్ర, శానిటరీ ఇన్స్ స్పెక్టర్ శీనివాసులు, సత్యన్న, ఆర్వో అస్లాం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement