Thursday, October 17, 2024

AP – సీతారాంపురం హత్య కేసులో సిఐ ఎస్ఐ సస్పెన్షన్..

ప్రభ న్యూస్ నంద్యాల బ్యూరో – .. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నంద్యాల జిల్లాలోని శ్రీశైలం నియోజకవర్గ పరిధిలో మహానంది మండలం సీతారాంపురంలో రాజకీయ హత్య జరిగింది. ఈ హత్యలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని ఆరోపణతో హోం శాఖ నంద్యాల రూరల్ సిఐ శివకుమార్ రెడ్డి ని మహానంది ఎస్సై నాగ ప్రసాద్ లని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

సీతారాంపురం గ్రామానికి చెందిన పసుపులేటి పెద్ద సుబ్బరాయుడు అనే వ్యక్తిని భార్య ఎదురుగానే 30 మంది మారణాయుధాలైన గొడ్డలి తో బండ రాళ్లతో కొట్టి చంపిన వైనంపై వైసిపి నాయకులు ప్రభుత్వం పై దారుణమైన ఆరోపణలు చేసిన సంఘటన జరిగింది. గ్రామంలో 30 మంది దుండగులు సైర్య విహారం చేశారని వారి బంధువులను సైతం కొట్టారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

గ్రామంలో టిడిపి నాయకులు దాడులు చేస్తున్నారని ఎస్పీకి పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ స్పందించకపోవడంతో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందని హోంశాఖ పేర్కొంటుంది.విచారణ సందర్భంలో పోలీసుల నిర్లక్ష్యం కనబడిందని ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

హోం శాఖ ఈ సంఘటనపై సీరియస్ అయింది. లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తుంది.ఈ విషయంపై జిల్లా ఎస్పీ అధి రాజ్ సింగ్ రాణా ప్రత్యేక నివేదికను ప్రభుత్వానికి పంపారు. దీని ఆధారంగా ప్రస్తుతానికి ఇద్దరు పై సస్పెన్షన్ వెటు పడిందని మరి కొంతమంది కానిస్టేబుల్ పై కూడా సస్పెన్షన్తో పాటు క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశాలు అధికంగా ఉన్నాయని పోలీస్ వర్గాలు తెలుపుతున్నాయి.

జిల్లాలో నందికొట్కూరు నియోజకవర్గం లో వాసంతి అనే 9 సంవత్సరాల బాలికలను గ్యాంగ్ రేప్ చేసి హత్య చేసి శవం కనపడకుండా చెసిన సంఘటనలోనూ పోలీసులను సస్పెండ్ చేశారు. జిల్లాలో జరిగిన ఈ రెండు సంఘటనల పట్ల పోలీసుల నిర్లక్ష్యం కనబడుతుందని ప్రజల ఆరోపిస్తున్న రు.ఈనెల 9వ తేదీన మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి హత్యకు గురైన కుటుంబాన్ని పరామర్శించేందుకు వస్తున్నట్లు వైసిపి నాయకులు పేర్కొంటున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement