Monday, November 25, 2024

ఖాకీల‌కు జ‌గ‌న్ షాక్ .. అల‌వెన్స్ ల‌లో కోత స్టార్ట్..

అమరావతి – ఎపి ప్ర‌భుత్వం పోలీసుల‌కు షాక్ ఇచ్చింది.. రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ ల‌కు క‌ల్పించిన‌న వివ‌ధ అలవెన్స్ ల్లో కోత విధించింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో నెం 79ని విడుదల చేసింది. ఈ కోత ఈ నెల జీతాల నుంచే ప్రారంభం కానుంది.. కాగా గత నెల( 12వ తేదీన అలవెన్సులలో కోత విధిస్తూ జీవో నెంబర్ 79ని ప్ర‌భుత్వం జారీ చేసింది. ఇక జీవోకు అనుకూలంగా ఉన్నట్లు ప్రభుత్వానికి డీజీపీ కార్యాలయం తెలిపింది.. దీంతో రాష్ట్ర పోలీస్ అలవెన్స్ ల్లో కోతలు మొదలయ్యాయి.

ఇక వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దిశ సిబ్బందికి అంతకముందు కేటాయించిన 30 శాతం అలవెన్స్ ను పూర్తిగా తొలిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో పని చేసే యాంటీ నక్సలిజం స్క్వాడ్(ఏ.ఎన్.ఎస్) సిబ్బందికి ఉన్న 15 శాతం అలవెన్స్ ను కూడా పూర్తిగా తొలిగించింది. డిప్యూటేషన్ పై ఏసీబీలో పని చేస్తున్న వారి అలవెన్స్ 30 నుండి 25 శాతానికి కుదించింది.. అలాగే ఏసీబీలో నేరుగా రిక్రూట్ అయిన వారి అలవెన్స్ 10 నుంచి 8 శాతానికి కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏజెన్సీలో పని చేసే ప్రభుత్వ ఉద్యోగులకు అడిషినల్ హెచ్ఆర్ఏ సైతం తొలగించింది. కానిస్టేబుల్స్ సైకిల్ అలవెన్స్ కూడా ఎత్తివేసింది.
ఈ అల‌వెన్స్ ల‌లో కోత విధించడం ప‌ట్ల పోలీస్ వ‌ర్గాల‌లో అసంతృప్తి వ్య‌క్త‌మవుతున్న‌ది.. అలాగే విప‌క్షాలు సైతం ఈ కోత అల‌వెన్స్ ల జీవోను త‌ప్పుప‌డుతున్నాయి.. జ‌గ‌న్ చ‌ర్య‌ను విమ‌ర్శిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement