అమరావతి – టాలీవుడ్ సీనియర్ నటుడు, వైఎస్ఆర్సీపీ నాయకుడు, మాజీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళిపై సీఐడీ కేసు నమోదైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ సీఐడీకి ఫిర్యాదు చేశారు.
దీంతో పోసానిపై ఈనెల 9న కేసు నమోదు అయినట్లు సమాచారం. బీఎన్ఎస్ 2003 యాక్ట్ ప్రకారం.. 111, 196, 353, 299, 341, 336 (3) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
- Advertisement -