ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రిటైర్డ్ ఐఏఎస్ పీవీ రమేష్ ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు వచ్చారు. హైదరాబాద్ లోని కొండాపూర్ లో ఉన్న ఆయన ఇంటికి ఏపీ సీఐడీ పోలీసులు వచ్చారు. ఓ కేసు విషయంలో ఈనెల 22న విచారణకు హాజరుకావాలని నోటీసులిచ్చారు.
పీవీ రమేష్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహిత ఐఏఎస్ అధికారి. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు అత్యంత కీలకమైన పదవుల్లో పని చేశారు . తర్వాత ఆయన కేంద్ర సర్వీసులకు వెళ్లారు. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ప్రత్యేకంగా రాష్ట్ర సర్వీసుకు తీసుకు వచ్చారు. కీలక బాధ్యతలు ఇచ్చారు. రిటైరైన వెంటనే ఆయనను సలహాదారుగా నియమించారు.