Friday, November 22, 2024

AP – టెక్​ రంగంలో.. బెస్ట్‌గా నిలుద్దాం – ఐటీ, డ్రోన్, సెమీకండక్టర్ల‌ పాలసీపై సీఎం స‌మీక్ష

ఏపీని అన్నింటా టాప్‌లో ఉంచుదాం
ఐటీ, డ్రోన్, సెమీకండక్టర్ల‌ పాలసీపై సీఎం స‌మీక్ష
స‌చివాల‌యంలో హైలెవ‌ల్ ఆఫీస‌ర్ల‌తో భేటీ
ఏఐ హ‌బ్‌గా మార్చేందుకు పాల‌సీల్లో మార్పులు
డ్రోన్ ప‌రిశ్ర‌మ‌ల‌కు అనంత కేంద్రం కావాలి
సెమీ కండ‌క్ట‌ర్ల‌కు శ్రీ‌సిటీ సెంట‌ర్ చేద్దాం
ఐటీ రాజ‌ధానిగా విశాఖ‌ను మారుద్దాం
పాల‌సీ ప్ర‌కారం ముందుకెళ్లాల‌ని సూచించిన సీఎం

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, అమ‌రావ‌తి :
మారుతున్న కాలానుగుణంగా సాంకేతిక రంగంలో మార్పులు రావాల‌ని ఏపీ సీఎం చంద్ర‌బాబు అన్నారు. ఏపీని ఏఐకి హ‌బ్‌గా మార్చాల‌నే ఉద్దేశంతో ప‌లు పాల‌సీల్లో మార్పులు తీసుకువ‌స్తున్న‌ట్టు చెప్పారు. ఐటీ, డ్రోన్, సెమీకండక్టర్ పాలసీలపై సచివాలయంలో మంగ‌ళ‌వారం సమీక్ష నిర్వ‌హించారు.. ఈ స‌మీక్ష‌లో సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఇత‌ర‌ అధికారులు పాల్గొన్నారు. డ్రోన్ ప‌రిశ్ర‌మలు స్థాపించే వారికి గ‌మ్యంగా అనంత‌పురం ఉండాల‌ని అన్నారు. సెమీ కండ‌క్ట‌ర్ల హైబ్‌గా శ్రీ సిటీని మార్చాల‌ని అధికారులకు సీఎం సూచించారు.. ఇక ఐటీ రాజ‌ధానిగా విశాఖను తీర్చిదిద్దాల‌ని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement