Wednesday, September 18, 2024

Top Story – స్టీల్ సిటీ లో చైల్డ్ మాఫియా

విశాఖ లో శిశు మాఫియా గ్యాంగ్ గుట్టురట్టు..!

★ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న స్పెషల్ బ్రాంచ్

★ ఏడున్నర లక్షల కు 5 నెలల చిన్నారి ని అమ్మకం

★సిరిపురం జంక్షన్ లో బేరసారాలు!

★ఎస్బి పంజా కి చిక్కిన శిశు మాఫియా గ్యాంగ్!

- Advertisement -

★ఎస్బి పనితీరుకు ప్రశంసించిన సీపీ

★ ఈ వ్యవహారంపై లోతుగా విచారణ చేపడుతున్న త్రి టౌన్ పోలీసులు

విశాఖ క్రైం : ప్రభ న్యూస్పగడ్బందీగా రెండో కంటికి తెలియకుండా చిన్నపిల్లలను అమ్మే ముఠా గుట్టురట్టయింది. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు గుట్టు చప్పుడు కాకుండా ఈ ముఠాను పట్టుకునట్లు తెలుస్తోంది.దీంతోనగరంలోఈ మాఫియా బాగోతం వెలుగులోకి వచ్చింది.స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ..సిబ్బంది పంజా కు చిన్నపిల్లలు అమ్మే ముఠా అడ్డంగా బుక్కయ్యింది.పక్కా సమాచారం తో ఆదివారం తెల్లవారుజామునఈ ముఠాను పట్టుకున్నారు.

సిరిపురం జంక్షన్ వద్ద 8 మంది ముఠా సభ్యులను పక్కా సమాచారంతో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకుని త్రి టౌన్ పోలీసులకు అప్పగించినట్లు విశ్వసనీయత సమాచారం!

5 నెలల బిడ్డను ఏడూన్నర లక్షలకు విక్రయిస్తుండ గా పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంతో ప్రస్తుతంa సంచలనం గా మారింది. వీళ్లంతా ఉమ్మిడి విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లా కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు!

వీరి వెనక ఇంకా చాలా పెద్ద ముఠా ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.విశాఖ,అనకాపల్లి, అల్లూరి జిల్లా ప్రధాన హాస్పిటల్గైనిక్ వార్డులే వీరికి అడ్డాగా మారాయి.కొన్ని ప్రవేట్ హాస్పిటల్స్ తో కూడా వీరికి లింక్ లు ఉన్నట్లు తెలుస్తుంది. నిందితుల నుండి ఎంత మంది పిల్లలు విక్రయాలు చేశారో తెలియాల్సి ఉంది. అమ్ముతున్న పిల్లలు తల్లిదండ్రులు ఎవరన్నా కోణంలో విచారణ వేగవంతం చేశారు.

తాజాగా వరుస ఘటనలతో మరోసారి విశాఖ ఉలిక్కిపడింది. స్పెషల్ బ్రాంచ్ పనితీరు. ఇన్ఫర్మేషన్ భేష్ అని పలువురు ప్రశంసిస్తున్నారు. స్పెషల్ బ్రాంచ్ ఇటీవల అనేక కీలక కేసులలో విజయం విజయం సాధించింది.స్పెషల్ బ్రాంచ్ లో కింద స్థాయి సిబ్బంది పనితీరు పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కేజీహెచ్ బూచి తో తల్లిదండ్రులకు టోకరా వేసిన ఓ గ్యాంగ్..!

ఇటీవలే విశాఖ పెద్దాస్పత్రి కేజీహెచ్లో శిశు మాఫియాహల్చల్ చేస్తోంది.ఉత్తరాంధ్ర,ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఇందు కోసం కొన్ని ముఠాలు పని చేస్తున్నట్లు గుర్తించారు.అప్పుడే పుట్టిన నవజాత శిశువును విక్రయిస్తామని చెబుతూ ఒక కుటుంబం నుండి భారీ ఎత్తిన డబ్బులు వసూలు చేశారు.వారికి మోసం మని తెలియడం తో వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీనితో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రాంభించారు.

ప్రస్తుతం కేజీహెచ్ లో తిష్ట వేసిన మాఫీయా ఇదే పనిగా పెట్టుకుంది.ఇక్కడ పెద్ద రింగ్ మాస్టర్లు.వీరి సహకారంతోనేఇక్కడ వ్యవహారం కొనసాగుతుందనే ఆరోపణలు ఉన్నాయికేజీహెచ్ ను వేదిక చేసుకుంటూ రోజు ఈ దందా సాగిస్తున్నారు.శ్రీకాకుళం,ఏజెన్సీప్రాంతాల్లో నుంచి వచ్చి ఇక్కడ పిల్లలు అమ్మకాలు కు శ్రీకారం చుడుతున్నారు.

కొందరు అనధికార సిబ్బంది అండదండలు ఉండటంతో ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది.శిశువు ఫోటోలు చూపించి లక్షల్లో అమాయకుల వద్ద నగదు వసూలు చేసి బురుడి కొట్టిస్తూన్నారు.నగర పోలీసు కమిషనర్ ఇలాంటి గ్యాంగ్ లపై కఠినమైన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement